manatelanganatv.com

ఇక ముద్రగడ పద్మనాభరెడ్డి.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

పిఠాపురంలో గెలిస్తే పవన్ కళ్యాణ్ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకోవాలని సూచించిన ముద్రగడ పద్మనాభం.. పేరు మార్చుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలవగానే పేరు మార్చుకున్నాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. కొందరు ఆయన ఫోటోతో నామకరణం కూడా చేశారు.

ఈ ట్రోలింగ్‌పై స్పందించిన ముద్రగడ.. మీడియా ముఖంగా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తన పేరు మార్చుకోవాలని ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చినట్లు ఇటీవల ఓ వార్తా పత్రిక ప్రచురించింది.

Leave a Comment