భారత మార్కెట్లోకి వోల్వో కార్ ఇండియా నుంచి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయి. వోల్వో లైనప్‌లో వోల్వో XC40 రీఛార్జ్, C40 రీఛార్జ్ వంటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (BEVs)విక్రయిస్తోంది. వోల్వో కార్స్ ప్రకారం.. భారత మార్కెట్లోకి మరో రెండు ఎలక్ట్రిక్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు (SUV), EX30, EX90లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
స్వీడిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ భారతీయ విభాగం మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ XC40 రీఛార్జ్ ట్విన్ మోటార్‌ను 2022లో విడుదల చేసింది. కంపెనీ రెండవ ఎలక్ట్రిక్ SUV,C40 రీఛార్జ్ ట్విన్ మోటార్‌ను 2023లో ప్రవేశపెట్టింది.
వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్ మోటార్ మార్కెట్లోకి ప్రవేశించింది. 2024 వోల్వో గత నెలలో భారత మార్కెట్లోకి 1,000 యూనిట్ల బీఈవీ విక్రయాల మైలురాయిని అధిగమించింది.
వోల్వో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కార్‌మేకర్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ డైరెక్ట్ సేల్స్ మోడల్‌ను ఉపయోగించి విక్రయిస్తుంది. 2030 నాటికి మొత్తం పోర్ట్‌ఫోలియోను ఎలక్ట్రిక్‌గా మార్చే లక్ష్యంతో కంపెనీ ప్రతి ఏడాదిలో ఒక బీఈవీ దేశ మార్కెట్లోకి విడుదల చేస్తుంది.
“మేం మా ఉత్పత్తులను వేగవంతం చేస్తున్నాం. వచ్చే ఏడాది (2025) EX30తో బయటకు వస్తాం. మా ఎలక్ట్రిక్ ఎస్యూవీ లైనప్‌కు కొత్తగా వచ్చి చేరుతుంది. వోల్వో EX30కి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో మంచి ఆదరణ లభించింది. భారత్‌లో కూడా మంచి ఆదరణ పొందుతుందని వంద శాతం నమ్మకం ఉంది’’ మీడియా సమావేశంలో పర్సన్ పేర్కొన్నారు