భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ఆయన గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో థానే జిల్లాలోని కల్హర్‌లో ఉన్న ఓ దవాఖానలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌తో అతడు దవాఖానలో చేరగా వైద్య పరీక్షల్లో అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్టు తేలింది . ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిపై కాంబ్లి తాజాగా స్పందించారు. వైద్యుల వల్ల తాను బతికే ఉన్నానని తెలిపారు. ‘ఇక్కడి డాక్టర్ల వల్ల నేను బతికి ఉన్నాను’ అంటూ హాస్పిటల్ బెడ్‌పై నుంచి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం కాంబ్లి స్టేట్‌మెంట్ వీడియో వైరల్ అవుతోంది.