తిరుమల ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని ఆయన అన్నారు. దీన్నొక యాక్సిడెంట్‌గా తీసుకోవాలని…జరిగినదానికి ఎవరూ ఏమీ చేయలేరని…ఇక ముందు ఏం జరగాలోదాని గురించి ఆలోచించాలని చెప్పారు.
సోషల్ మీడియా వల్లనే..
ఇదంతా సోషల్ మీడియాలో దర్శనాలు ఉండు అనే రూమర్స్ వ్యాప్తి చెందడం వల్లనే అయిందని విచారం వ్యక్తం చేశారు. తాను అలెర్ట్‌గానే ఉన్నానని…ఈరోజు ఉదయం కూడా మీడయా సమావేశంలో కూడా వదంతలును నమ్మొద్దని చెప్పానని చెప్పారు. తాను పోలీస్ కమిషనర్‌తో కూడా మాట్లాడానని…5 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నట్టు ఆయన చెప్పారని బీఆర్ నాయుడు తెలిపారు.
25 మంది దాకా..
రుయా, సిమ్స్ ఆసుపత్రుల్లో 25 మంది దాకా గాయపడిన వారు చికిత్స పొందుతున్నారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. అక్కడ పరిస్థితి కొంత ఉద్రితంగా ఉదని ఆయన అన్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వస్తున్నారని…ఆయన వచ్చాక తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.