ఇదెక్కడి ప్రభుత్వం రా బాబు అంటూ రేవంత్ సర్కార్‌పై జనం మండిపడుతున్నారు. సమస్య ఇదీ అని గోడు వెళ్లబోసుకుంటే.. ఏకంగా బెదిరిం పులకు దిగుతున్నారు. రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నా రు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ లోని రాఘవేంద్ర కాలనీలో చోటుచేసుకుంది.కరెంట్ పోయిందని ఫిర్యాదు చేసిన వినియో గదారుడి ఇంటికి వెళ్లి మరీ విద్యుత్ శాఖ అధికా రులు బెదిరించిన వైనం సర్వత్రా విమర్శల పాల వుతోంది.
ఇటీవల కుత్బుల్లాపూర్ ఏరియా పరిధి లోని రాఘవేంద్ర కాలనీలో కరెంట్ పోగా అక్కడ కిరాయికి ఉండే వ్యక్తి సర్వీస్ నంబర్ తో సహా ఫిర్యాదు చేశాడు. సర్వీస్ నంబర్ ద్వారా ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు చేసిన ట్వీట్ డిలీట్ చేయకపోతే బిల్లులో అదనపు రుసుములు వేస్తామని ఇంటి ఓనరును బెదిరించారు. ఈ విషయాలన్నీ చెప్పుకొని సదరు వినియోగదా రుడు వాపోయాడు. గతంలో చేవెళ్లలో విద్యుత్ సమస్య గురించి ఫిర్యాదు చేసిన సమయంలో కూడా అక్కడ సిబ్బంది ఇదే విధంగా ట్వీట్ డిలీట్ చేయాలని పట్టుబట్టారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో వినియోగదారులు కూడా ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.