తెలంగాణ : తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. మొత్తం 5.08,385 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. https://results.cgg.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ పదవ ఫలితాలను కనుగొనవచ్చు. విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేస్తే, ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాలతోపాటు మార్కుల మెమో ఉంటుంది. గతేడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న ముగియగా.. మే 10న ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 15 రోజుల ముందుగానే పరీక్షలు పూర్తయ్యాయి.
0