manatelanganatv.com

కారు డ్రైవర్‌ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ.. హెల్మెట్ ధరించలేదంటూ ఓ కారు యజమానికి జరిమానా విధించిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది. తాను ఎప్పుడూ కారులో నోయిడాకు వెళ్లలేదని, కానీ అక్కడి ట్రాఫిక్ పోలీసులు మాత్రం హెల్మెట్ లేదనే కారణంతో తనకు రూ.1000 జరిమానా విధించారని తుషార్ సక్సేనా వాపోయాడు.

జరిమానాకు సంబంధించి మొదట ఒక మెసేజ్ రాగా దానిని తాను పట్టించుకోలేదని, ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే అని భావించానని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఒక ఈ-మెయిల్, మరొక మెసేజ్ కూడా రావడంతో విషయం అర్థమైందని, నోయిడాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ జిల్లాలో తాను నివసిస్తున్నానని అతడు వివరించాడుు. జరిమానా విషయమై ట్రాఫిక్ పోలీసులను సంప్రదించానని, హెల్మెట్ లేకుండా ఫోర్-వీలర్ వాహనాన్ని నడిపినందుకు ఫైన్ విధించామంటూ సమాధానం ఇచ్చారని తుషాక్ సక్సేనా వివరించాడు. జరిమానా చెల్లించకపోతే కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారని పేర్కొన్నాడు.

కారులో హెల్మెట్ ధరించాలనే రూల్ ఉందా?
నవంబర్ 9, 2023న చలాన్ వచ్చిందని తుషార్ సక్సేనా వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడం సాధారణమే, కానీ తన విషయంలో మాత్రం ఈ జరిమానా సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎప్పుడూ కారును ఢిల్లీ (ఎన్‌సీఆర్) ప్రాంతానికి తీసుకెళ్లలేదని, హెల్మెట్ ధరించి కారు నడపాలనే నిబంధన ఏదైనా ఉంటే అధికారులు తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. కాగా గతేడాది మార్చిలో తాను కారును కొనుగోలు చేశానని, వాహనం రిజిస్ట్రేషన్‌ను ఘజియాబాద్ నుంచి రాంపూర్‌కు మార్చుకున్నానని వివరించాడు. విచారణ జరిపి తన జరిమానాను రద్దు చేయాలంటూ నోయిడా ట్రాఫిక్ పోలీసులకు తుషార్ సక్సేనా విజ్ఞప్తి చేశాడు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278