manatelanganatv.com

బాలిక బ్రెయిన్డెడ్.. పది మందికి ప్రాణదానం

మేడ్చల్, కళాశాలకు వెళ్తుండగా బాలికకు ఫిట్స్ వచ్చి బ్రెయిన్డెడ్ అయింది. చికిత్స చేయించినా పలితం లేకుండా పోయింది. బాలిక బతుకుతుందనే వైద్యులు భరోసా ఇవ్వ లేదు. బాలిక తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో బాలిక అవయవాలు దానం చేసి మరో పదిమందికి ప్రాణం పోశారు. మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. రెండో కూతురు కూర దీపిక(16) నగరంలోని ఓ కళాశా లలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల22న ఇంటి నుంచి బయలుదేరే సమ యంలో వాంతులతో ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్చించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్ పై వైద్యం అందించారు. బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తేల్చారు. ఆ తల్లి దండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి బాలిక అవయ వాలు దానం చేసేందుకు నిర్ణయించారు. ఈనెల 25న బాలిక మృతి చెందడంతో బాలిక అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు. ఇదే విషయం పై మేడ్చల్ పట్టణంలోని సోషల్ మీడియా వేదికగా బాలిక తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.

Leave a Comment