జై శ్రీరామ్..ఎక్కడ చూసినా నేడు శ్రీరామనామ స్మరణతో మార్మొగుతుంది. ఇక రామనవమి సందర్భంగా ప్రపంచంలోనే అయోధ్య ప్రత్యేకం కానుంది. రాంలాలా పుట్టిన రోజు వేడుకలు పురస్కరించుకుని అయోధ్య అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, రామలల్లా ప్రతిష్ఠాపన తర్వాత ఇదే మొదటి రామ నవమి (రామ నవమి 2024)కావడంతో ఇక్కడ ప్రత్యేక సన్నాహాలు జరిగాయి. ఏన్నేళ్లైన చెక్కుచెదరని కళాఖండంలా నిర్మించిన అయోధ్య ఆలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే దర్శనమిస్తాయి.. అందులో ఒకటి సూర్య తిలకం. సూర్య అభిషేకం లేదా సూర్య తిలకం అని పిలువబడే ఆచారంలో సూర్యుడు బాలరాముడి నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలో ఉండే రాముడి నుదుటిపై మధ్యాహ్నం 12 గంటలకు, రాముడు జన్మించిన సమయంలో సూర్య తిలకం రాంలాలా నుదిటిపై ఆవిషృతమవుతుంది. దీని కోసం శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు అతని నుదుటిపై దేద్ధీప్యామానంగా వెలిగిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. శాస్త్ర సూత్రం ప్రకారం శ్రీరాముని సూర్య అభిషేకం జరుగుతుంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి గతంలో పలుమార్లు పరీక్షించి విజయవంతమయ్యారు. ఇక్కడ విశేషమేమిటంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా అవుతుంది.
రామ నవమి రోజున, సూర్యకాంతి ఆలయం మూడవ అంతస్తులో అమర్చిన మొదటి అద్దంపై పడుతుందని, ఇక్కడ నుండి ప్రతిబింబిస్తుంది. ఇత్తడి పైపులోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత ఇది ఇత్తడి పైపులో అమర్చబడిన రెండవ అద్దాన్ని తాకుతుంది. 90 డిగ్రీల వద్ద మళ్లీ ప్రతిబింబిస్తుంది. దీని తరువాత ఇత్తడి పైపు గుండా వెళుతున్నప్పుడు, ఈ కిరణం మూడు వేర్వేరు లెన్స్‌ల గుండా ప్రవహించి, పొడవైన పైపు గర్భగుడి చివర అమర్చిన అద్దాన్ని తాకుతుంది.