manatelanganatv.com

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై పెద్ద కేసులే పెట్టారుగా.. జైలు తప్పదా..

నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనపై 105, 118(1) రెడ్ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్షపడే అవకాశం ఉంది.

ఇంటికెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు..

అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించనున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తాను థియేటర్‌కు వస్తున్నట్లు ముందుగానే థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ..

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన బాధిత మహిళ కుటుంబానికి తాము అండగా ఉంటామని అల్లు అర్జున్ ఇంతకుముందే ప్రకటించారు. సినిమా యూనిట్ తరఫున సదరు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. అలాగే.. చికిత్స కోసం అయిన ఖర్చునంతా తామే భరిస్తామని ప్రకటించారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278