manatelanganatv.com

షాపింగ్‌ మాల్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్ల సంద‌డి..

ప్ర‌స్తుత ఐపీఎల్‌ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదార‌బాద్ జ‌ట్టు అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 9 మ్యాచుల్లో 5 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంది. ఇక త‌న‌ తరువాతి మ్యాచ్‌ను హైద‌రాబాద్‌ గురువారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో త‌ల‌ప‌డ‌నుంది. సొంత‌మైదానం ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ఉన్న ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజ‌గా గ‌చ్చిబౌలిలోని శ‌ర‌త్ సిటీ క్యాపిట‌ల్ మాల్‌లో స‌న్ రైజ‌ర్స్ క్రికెట‌ర్లు సంద‌డి చేశారు. జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్‌, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్‌, టీ. న‌ట‌రాజ‌న్, అబ్దుల్ స‌మ‌ద్‌లు మాల్‌లో షాపింగ్ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్య‌లో షాపింగ్ మాల్‌కు త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా త‌మ అభిమాన ఆట‌గాళ్ల‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278