పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుపతి పట్టణంలోని ప్రధాన కూడలిలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీని పెట్టి పరారయ్యారు.
కాగా ఉదయం స్వామి వారి విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీపెట్టి ఉండటం గమనించిన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. కాగా ఈ సమాచారం అందుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని.. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని.. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడు, పదకవితా పితామహుడిని కించ పరిచేలా వ్యవహరించిన దుండగులు వ్యవహరించారని మండిపడ్డారు.క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళనతో కూడిన హెచ్చరిక జారీ చేశాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. చేశారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి హిందూ సంఘాలు.