వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీ ప్రక్రియ అమలులో భాగంగా గురువారం రూ.6వేలకోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వెల్లడించా రు. రుణమాఫీ తొలి విడుతగా లక్ష రూపాయల వరకూ మాఫీ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఆరు వేలకోట్లు జమ చేస్తామన్నారు. దీనివల్ల 11 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
మరో పది రోజుల్లో వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వెల్లడించారు. మొత్తం రూ.2లక్షల రుణమాఫీ ప్రక్రియను ఆగస్ట్ 15లోపు పూర్తి చే సేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతల కుటుంబసభ్యుల నిర్ధారణ కోసమే రేషన్ కార్డు అని, పాత పద్ధ్దతిలోనే కుటుంబానికి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 60 లక్షల మంది రైతుల ఖాతాలకు గాను, 6లక్షల మందికి రేషన్ కార్డు లేదని తెలిపారు. అటువంటి వారికోసం రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ వర్తిస్తుందని వివరణ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన కొన్ని డబ్బులు వడ్డీలకే సరిపోయాయన్నారు. రెం డు లక్షలు రుణమాఫీ ఒకేసారి చేస్తుంటే బిఆర్‌ఎస్ నేతలు తమపై నిందలువేస్తున్నారన్నారు. తెల్ల రేషన్ కార్డు అనేది కుటుంబ నిర్ధారణ కోసమే అని తెలిపారు. దాదాపు 38లక్షల కుటుంబాలు బ్యాం కుల ద్వారా రుణాలు తీసుకున్నాయని తెలిపారు. రుణమాఫీ కోసం 31వేలకోట్లు ఖర్చవుతుందన్నా రు. గత ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసింద న్నారు. ఒకేసారి రుణమాఫీ చేసింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు. జులై 18న ప్రతి మండల కేంద్రంలో రైతువేదికల్లో సంబరాలు చేస్తారని, ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారిని మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు.