గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తేజ వైన్స్ యాజమాన్యం రోజురోజుకు రెచ్చిపోతూ మందుబాబులను వైన్స్ లో మందు కొని వైన్స్ ముందే కూర్చొని మందును సేవిస్తున్నా పట్టించుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొసాగిస్తున్నారు. పర్మిట్ రూమ్ ఉన్న పర్మిట్ రూమ్ లో కూర్చొని మందు సేవించక రోడ్డుపై కూర్చొని తాగడంతో అటుగా వెళ్ళే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో పిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవటంతో అధికారులు వైన్స్ యాజమానుల వద్ద మామూలు తీసుకుంటూ వదిలేస్తున్నారంటూ ప్రజల్లో గుసగుసలు. ఎప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి వైన్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామ ప్రజలు.
0