manatelanganatv.com

రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలలోగా రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. రేపు సాయంత్రం లోగా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.

ఈ నెలాఖరులోగా రెండో దఫాలో లక్షన్నర రూపాయల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్ట్ నెలలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 7 నెలల్లోనే సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఏకమొత్తంలో వీటిని మాఫీ చేస్తామని పేర్కొన్నారు.

hey-are-looking-to-get-political-benefit-in-the-name-of-postponement-of-dsc
hey-are-looking-to-get-political-benefit-in-the-name-of-postponement-of-dsc

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278