రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భరాద్రి కోట గూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో 6.5 సెం.మీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడలో 6.5 సెం.మీ, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తుప్రాన్ జిల్లా ఇస్లాంపూర్‌లో 5.8, శంకర్పేటలో 5.1 సెం.మీ చొప్పున కురిసింది. మరోవైపు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు.