ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప2’ ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. విడుదలై రెండు వారాలు కూడా గడవకముందే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఇక నార్త్ లో అయితే ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇక ఓటీటీలో సందడి చేసే టైం కూడా వచ్చేసిందంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది.. ‘పుష్ప 2’ 2025 జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుందని సమాచారం.
అయితే దీనిపై మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘పుష్ప’ పార్ట్-1 మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేస్తే.. ‘పుష్ప2’ కోసం నెట్ ఫ్లిక్స్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ కే నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.200 కోట్లు పెట్టిందట. అదికూడా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలన్నింటికీ కలిపి.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.