తెలంగాణ సర్కార్ పలువురు డిప్యూటి తహశీల్దార్ లకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో 83 మంది డిప్యూటి తహశీల్దార్ లకు తహశీల్దార్ లుగా ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏకు టీజీటీఏ ధన్యవాదాలు తెలియజేసింది. తెలంగాణ ఉద్యోగుల చైర్మన్ లచ్చిరెడ్డి, టీజీటీఏ కృషి ఫలితంగానే డీటీలకు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించిందని తహశీల్దార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు కూడా టీజీటీఏ కృషి ఫలితంగానే పదోన్నతులు లభించాయని నేతలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉద్యోగుల జఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, తహశీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్, సెక్రటరీ జనరల్ పూల్సింగ్ చౌహాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న డీటీలకు తహశీల్దార్ లుగా అవకాశం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
0