manatelanganatv.com

 ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఓ అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ గా ఆయన్ని నియమించింది. ఈ పదవి గురించి సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పదవిలో దిల్‌రాజు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

దిల్‌ రాజుఅసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి అనే సినిమాతో పంపిణీదారుడిగా దిల్‌రాజు కెరీర్‌ మొదలు పెట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్‌ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్‌రాజుగా మారింది. టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమై చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

భారీ బడ్జెట్‌ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి ఛాన్సులు ఇస్తారు.ఇటీవల ఆయన అవకాశమిచ్చిన బలగం సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. సుహాస్ నటించిన జనక అయితే గనక అనే మూవీని కూడా నిర్మించగా.. మంచి టాక్ అందుకుంది. సినిమా ఇండిస్ట్రీకి కొత్తగా వస్తున్న వారిని ప్రొత్సహించేందుకు దిల్‌రాజ్ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు.. కొత్త టాలెంట్‌ను ప్రొత్సహిచేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో కొత్త బ్యానర్‌ క్రియేట్‌ చేస్తున్నామని ఇటీవలే ఆయన ప్రకటించారు.

అందు కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను లాంచ్‌ చేస్తానని తెలిపారు..ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. రామ్‌చరణ్‌- శంకర్‌ల కాంబోలో భారీ బడ్జెట్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం దిల్‌రాజ్ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278