హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (హెచ్ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హెజ్ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ప్రక్రియ ఇతర ప్రాథమిక పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకున్నదన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణ నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేక దష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. కోర్టు కేసులపై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారు కెఎస్ శ్రీనివాసరాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవిన్మిట్టల్, అటవీ శాఖ అదనపు కార్యదర్శి ప్రశాంతి, ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్ది, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
0