0
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ ప్రధాన రహదారి పక్కన ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గోడౌన్ రోడ్డుకోసం చెట్లను తొలగించి దర్జాగా రోడ్డు వేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణంతో ప్రధాన రహారిపై రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతున్నారు