పేరుకు మెడి స్టార్ ఆస్పత్రి..రోగులకు మెడికల్ సేవలందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆపదలో వచ్చిన వారికి చికిత్స అందించాల్సింది పోయి వారిలో భయం కల్పించి వైద్యం కోసం బేరసారాలు ఆడుతున్నారు. కొందరికి పక్కా గ్యారంటీ ఇస్తూ మరికొందరికి ఇక్కడ కాకుండా మరెక్కడా చికిత్స జరగదనే రీతిలో వైద్యులు చెబుతూ రోగులు, కుటుంబీకుల్లో ఆందోళన కల్పిస్తున్నారు. ఆస్పత్రికి బదులు ఓయో రూమ్స్ నడుపుకుని డబ్బులు సంపాదించాలని బాధితులు ఆస్పత్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశంలోని మెడి స్టార్ ఆస్పత్రిలో ఆకాష్ గుప్తా (24) అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాత్రి 200 శాతం ప్రాణానికి గ్యారంటీ ఇచ్చిన వైద్యులు తెల్లవారుజామున మృతి చెందడం పట్ల మృతుని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. నిన్న రాత్రి బైక్ ప్రమాదంలో గాయపడిన ఆకాష్ గుప్తా (24) ను మెడి స్టార్ ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులతో అర్జంట్ గా ఆపరేషన్ చేయాలి అందుకు అధిక మొత్తంలో డబ్బులు అడిగి బేరసారాలు ఆడి డబ్బులు కట్టించుకుని ఆపరేషన్ చేశాక హార్ట్ స్టోక్ వచ్చిందంటూ వైద్యులు కుంటి సాకులు చెబుతున్నారని మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రాణాలకు గ్యారంటీ ఇచ్చి మృతి చెందడం పట్ల వైద్యుల నిర్లక్ష్యం తోనే ఆకాష్ గుప్తా మృతి చెందాడంటూ ఆస్పత్రి ఎదుట ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ చేతి వేళ్లు కట్ అయి తీవ్ర రక్త స్రావంతో ఈ ఆస్పత్రిలో చేరితే మొదట డబ్బులు చెల్లించాలని, చేతి వేళ్లను అతికించడం కష్టమని ఏ ఆస్పత్రిలోనూ సాధ్యం కాదని మెడి స్టార్ వైద్యులు చెప్పారని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లి మా నాన్నకు మంచి వైద్యం ఇప్పించామని, ఇప్పుడు మాములు స్థితికి వచ్చాడని రమేష్ అనే బాధితుడు మీడియా ఎదుట తెలిపాడు. వైద్య సేవలందించేందుకు పెట్టిన ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు దండుకోవడమే పని పెట్టుకున్నారని, ఇలా డబ్బులు సంపాదించాలంటే ఆస్పత్రికి బదులు ఓయో రూమ్స్, హోటల్స్ నడుపు కోవాలని సూచించారు. మెడి స్టార్ ఆస్పత్రి డాక్టర్ల కంటే ఆర్ ఎం పీ డాక్టర్లు నయం అన్నారు. ఈ విషయంపై ఆస్పత్రి యాజమాన్యాన్ని వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎలాంటి స్పందన లేదు. ఇదిలా ఉంటే బీహార్ కు చెందిన ఆకాష్ గుప్తా అనే యువకుడు మెడిస్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్యంతోనే మృతి చెందాడంటూ మృతుని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, యువకులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకుని న్యాయం కావాలంటూ ఆందోళన చేపట్టారు. మహిళలు, యువకులు ఆస్పత్రిలోనికి వచ్చి గొడవ పడడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి చేరుకుని ఆందోళన కారులకు నచ్చజెప్పి శాంతియుత వాతావరణం కల్పించారు.