అసలు తండ్రీ కొడుకుల మధ్య గొడవకు కారణం ఏంటో బయటపెట్టింది మోహన్ బాబు ఇంట్లో పని చేసే పని మనిషి. మోహన్ బాబు దగ్గర పని చేసే ప్రసాద్ పై మనోజ్ చేయిచేసుకున్నాడని.. దీంతో సహించని మోహన్ బాబు.. మనోజ్ ను వారించాడని ఆమె చెప్పింది. తన స్టాప్ పై చేసుకోనే అధికారం మనోజ్‌కు లేదని.. మోహన్ బాబు తన చిన్న కొడుకుతో గట్టిగా చెప్పడంతో.. తండ్రీ కొడుకుల మధ్య కాస్త తోపులాట జరిగిందంటూ ఆమె మీడియాకు వివరించింది.
అంతేకాదు గతంలో మోహన్ బాబు మంచు మనోజ్ ల మధ్య గొడవలున్నాయంటూ మోహన్ బాబు ఇంట్లో పని చేసే లేడీ చెప్పింది. భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని.. అప్పటి నుంచి ఇద్దరూ కాస్త ఎడమొఖం పెడమొఖంగానే ఉంటున్నట్టు మీడియాకు చెప్పింది.
ఈ క్రమంలోనే మోహన్ బాబు దగ్గర పని చేస్తున్న ప్రసాద్‌ను మనోజ్ కొట్టడంతో.. గొడవ పెద్దదైంటూ ఆమె మీడియాకు వివరించింది. అంతేకాదు తండ్రి అంటే పెద్ద కొడుకు విష్ణు బాబు అమితమైన ప్రేమ అని.. ఈ విషయం తెలిశాక విష్ణు కోపంతో ఊగిపోయాడంటూ చెప్పింది. మధ్యలో మంచు లక్ష్మీ జోక్యం చేసుకున్నా.. అటు మనోజ్ కానీ.. ఇటు విష్ణు కానీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదంటూ.. ఇంట్లో జరిగిన తతంగాన్ని వివరించింది ఈమె.