కూకట్ పల్లి :శనివారం కెపిహెచ్బి డివిజన్ లోఎమ్మెల్యే మాధవరంకృష్ణారావు,కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు వివిధ అభివృద్ధి పనులకు పరిశీలించారు.ఇందులో భాగంగా మలేషియన్ టౌన్షిప్ వెనకాల 5ఎకరాల పార్కు పరిశీలన అనంతరం ఫోరం మాల్ ఫ్లై ఓవర్ కింద స్పోర్ట్స్ అరిన క్రీడా ప్రాంగణానికి సంబంధించి అధికారులతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.. అలాగే 4వ ఫేస్ ఎస్ టి పి ప్లాంట్ వద్ద ఫ్లైఓవర్ క్రింద ప్రాంగణానికి సంబంధించి అధికారులతో చర్చించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకి మౌలిక సదుపాయాలుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో ప్రారంభించిన పనులను త్వరితగతంగా పూర్తి చేయాలని, అలాగే కెపిహెచ్పి డివిజన్లో వేలకోట్ల రూపాయలతో గత పది ఏళ్ల నుంచి అభివృద్ధి చేస్తూ వస్తున్నామన్నారు. ఇందుకు నిదర్శనమే అనేక పార్కులు క్రీడా మైదానాలు ,ఇండోర్ షటిల్ కోర్టులు మొదలైనవి ప్రజలు ఇప్పటికే వినియోగించుకుంటున్నారు. ఇంకా ప్రజల సౌకర్యార్థం అందుబాటులో తీసుకొచ్చేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ..ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఈఈ శ్రీనివాస్, డి ఈ ఆనంద్, ఏఈ సాయి ప్రసాద్, యుబిడి సమత, వాటర్వర్క్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, కాలనీ వాసులు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0