తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి బీఆర్ఎస్ చైర్మన్లను దించి కాంగ్రెస్ నాయకులు నెగ్గుతున్నారు.
మేడ్చల్ మున్సిపల్ లో కూడా చైర్ పర్సన్ మర్రి దీపికనర్సింహ రెడ్డిపై మే నెలలో 9న అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. దానిపై ఎలాంటి పరిణామాలు రాకపోవడంతో అటు కాంగ్రెస్ కౌన్సిలర్లు, మేడ్చల్ ప్రజలు దీనిపై జోరుగా చర్చించుకుంటున్నారు. మేడ్చల్ లో మొత్తం 23 వార్డులు ఉండగా అందులో 1 బీజేపీ, 3 కాంగ్రెస్, 19 మంది బీఆర్ఎస్ లో ఉండగా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం చైర్ పర్సన్ మర్రిదీపికా నర్సింహరెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి నెల పూర్తయినా ఇప్పటివరకు అధికారులనుండి నోటీస్ రాకపోవడం విడ్డూరంగా ఉంది. రాజకీయంలో మల్లారెడ్డి, రేవంత్ రెడ్డికి విమర్శలు ఉన్న మల్లారెడ్డి అనుచరుడి పీఠాన్ని కాంగ్రేస్ నేతలు కదిలించలేకపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జిల్లా కలెక్టర్ నుండి మీటింగ్ నోటీస్ రాకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు నెత్తికి చేతులు పెట్టి కూర్చున్న పరిస్థితి వచ్చింది.