రోజుకు వెయిల సంఖ్యలో ప్రయాణం చేసే డిపోలో ప్రయాణికులకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతైనా అవసరం ఉంటుంది. కానీ మేడ్చల్ బస్ డిపోలో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఇటు డిపో సిభ్భంది అటు పోలీస్ సిభ్భంది విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. రోజుకు మేడ్చల్ డిపోనుండి విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవాళ్ళు వెయిల సంఖ్యలో ప్రయాణం చేస్తుంటారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసులకు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తుకు ఉపాయిగపడుపడతాయి. కానీ మేడ్చల్ బస్ డిపోలో మాత్రం నిఘా కేంద్రాలు లేకపోవడంతో ఆగడాలు మితిమీరించిపోతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు దీనిపై దృష్టి పెట్టి సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని మేడ్చల్ ప్రయాణికులు కోరుతున్నా
0