0
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత మాధవీ లత మండిపడ్డారు. లోక్సభలో ఒవైసీ ‘జై పాలస్తీనా’ అనటం వెనక ఏ కుట్ర కోణం దాగి ఉందో ప్రభుత్వం తేల్చాలన్నారు. ఒవైసీని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ విచారించాలని మాధవీ లత డిమాండ్ చేశారు. కాగా, ఎంపీ ఎన్నికల్లో మాధవీ లతపై అసదుద్దీన్ ఒవైసీ గెలుపొందిన విషయం తెలిసిందే.