రైతులపై కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకులు.. అప్పు తీర్చలేదని భూమిని వేలానికి వేసిన బ్యాంకులు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి తన భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు.. అసలు, వడ్డీతో కలిపి రూ.7.86 లక్షలు అయ్యింది.. అయితే అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్యాంకు అధికారులు ఎర్రజెండాలు పాతి.. 20వ తేదీన భూమిని వేలం వేయనున్నట్టు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. పంట దిగుబడి రాలేదని, ప్రభుత్వ సాయమూ అందలేదని ఎంత బ్రతిమిలాడినా బ్యాంక్ అధికారులు వినలేదు.
0