manatelanganatv.com

కేటీఆర్ షాకింగ్ ఆరోపణలు!

కాంగ్రెస్ వాళ్లు సర్కార్ నడుపుతలేరు సర్కస్ నడుపుతున్నారని కేటీఆర్ అన్నారు. ఫార్ములా వన్ ఈ-కార్ రేస్‌పై చర్చ పెట్టడానికి దమ్ములేక రేవంత్ పారిపోతున్నాడని మండిపడ్డారు. రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు రేవంత్ పత్తాలు ఆడుతాడంటూ ఆరోపణలు చేశారు.

కారు రేస్ ఇష్యూలో కాంగ్రెస్ ఎంత కక్ష్య చేసినా లీగల్‌గా ఎదుర్కొంటానని కేటీఆర్ అన్నారు. నా మీద కేసు కేసు పెట్టె దమ్ము ఉంది కానీ చర్చ పెట్టె దమ్ము లేదా? రేవంత్ నీ వీరత్వం నాలుగు గోడల మధ్య కాదు.. నాలుగు కోట్ల మంది ప్రజలు చూసేలా సభలో చర్చ పెట్టు దమ్ముంటే అంటూ సవాల్ విసిరారు. రేవంత్‌కు రోజు సాయంత్రం 4గంటల నుంచి 6 గంటలవరకు పత్తాలు ఆడే అలవాటు ఉందని ఆరోపించారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వాళ్లు హౌలగాళ్ళు.. నా రాష్ట్రం దివాళా తీసిందని చెబితే ఎవడైనా పెట్టుబడులు పెడతారా? హైద్రాబాద్ నగరం అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతుంది. అమరావతితో పోటీ పడే పరిస్థితులలో హైద్రాబాద్ లేదు. స్టే ఉన్న ఇళ్లను కూల్చిన విషయంపై బాధ్యత రంగనాథ్ తీసుకుంటాడా అని ప్రశ్నించారు.

ఇక రేవంత్ రెడ్డి స్వయంగా కారు రేస్ పై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఫార్ములా ఈ, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్న సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి. చర్చ నాలుగు గోడల మద్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకు వీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పె దమ్ములేదు. ఈ ఫార్ములా రేసులో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. న్యాయంగా వ్యవహరించే, ప్రభుత్వ అరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది. అధికారికంగా చెప్పే దమ్ములేక క్యాబినెట్ లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాపిస్తున్నారు. కెబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది. నిజాలు చెప్పే దమ్ము లేఖ సిఎస్ తో నోటీసులు, అనుమతులు అంటూ లీకులిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేఖిస్తున్నామన్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278