అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖండించారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా అక్కడ ఎవరు విఫలమయ్యారు? ప్రభుత్వ ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే.. హైదరాబాద్‌లో హైడ్రామా చేసిన భయంతో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
0