ఆర్ఆర్ఆర్’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు జాతీయ స్థాయిలో క్రేజ్ పెరిగింది. పాన్ ఇండియా హీరోగా తారక్ అవతరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో ‘వార్ 2’ సినిమాలో తారక్ నటిస్తున్నాడు. దీంతో షూటింగుల కోసం తారక్ ఎక్కువగా ముంబై వెళ్లాల్సి వస్తోంది. బాలీవుడ్ అంటేనే పార్టీ కల్చర్ ఎక్కువగా ఎంటుంది. బాలీవుడ్ లో ఎదగాలంటే సెలబ్రిటీలు పార్టీ కల్చర్ లో భాగం కావాల్సిందే.
తాజాగా ‘వార్ 2’ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లాడు. బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసిన ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్లాడు. ఈ పార్టీకి తారక్ భార్య ప్రణతి కూడా హాజరయింది. రణబీర్ కపూర్, అలియా భట్, హృతిక్ రోషన్, కరణ్ జొహార్ వంటి సెలబ్రిటీలు పార్టీకి హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వీరు బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఎన్టీఆర్, ప్రణతి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.