manatelanganatv.com

ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌గా బుమ్రా

ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ‌కప్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు తాజాగా మ‌రో అవార్డు ద‌క్కింది. జూన్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును అత‌డు సొంతం చేసుకున్నాడు. 

ఇక ఈ అవార్డు కోసం టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన స్టార్ ప్లేయ‌ర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా పోటీ ప‌డ్డారు. కానీ, వారిద్ద‌రినీ అధిగ‌మించి బుమ్రా అవార్డు ద‌క్కించుకోవ‌డం విశేషం. కాగా, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ ఆసాంతం ఈ స్టార్ పేస‌ర్ అద్బుతంగా రాణించాడు. త‌ద్వారా టీమిండియా టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 

బార్బడోస్‌లో జ‌రిగిన ఫైన‌ల్‌లో చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో రెండు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన బుమ్రా కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన ఒక వికెట్ కూడా తీశాడు. మొత్తంగా టోర్న‌మెంట్‌లో 4.17 ఎక‌నామీ, 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. దాంతో అత్యుత‌మ గ‌ణాంకాలు న‌మోదు చేసినందుకు గాను అత‌నికి ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ద‌క్కింది.

ఇది నాకు ప్రత్యేక గౌరవం: బుమ్రా
“జూన్ నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషం. అమెరికా, వెస్టిండీస్‌లో గడిపిన కొన్ని వారాలు ఎంతో చిరస్మరణీయం. ఆ తర్వాత నాకు ఇది ప్రత్యేక గౌరవం. జ‌ట్టుగా జ‌రుపుకోవ‌డానికి చాలా ఉంటాయి. కానీ, ఈ వ్యక్తిగత ప్రశంస ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే. టోర్నీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం, జ‌ట్టు ట్రోఫీ గెల‌వ‌డం చాలా ఆనందంగా ఉంది. చివర్లో ట్రోఫీ ఎత్తడం చాలా ప్రత్యేకమైంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను.

ఇక జూన్ నెలలో ఈ అవార్డు కోసం పోటీ ప‌డ్డ రోహిత్‌, గుర్బాజ్‌కు నా అభినంద‌న‌లు. చివరిగా నా కుటుంబ సభ్యులకు, నా సహచరులు, కోచ్‌లతో పాటు అభిమానులు నాకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు. వారి మద్దతు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను” అని జ‌స్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278