manatelanganatv.com

డిసెంబర్ 16న లోక్ సభముందుకు జమిలి ఎన్నికల బిల్లు!

 ఈ నెల 16న లోక్ సభముందు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది.129వ రాజ్యంగ సవరణ కింద బిల్లు ప్రవేశపెట్టనుండగా నాలుగు సవరణలు చేసే అవకాశం ఉంది. అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

ఈ మేరకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’ను డిసెంబర్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించాయి. అనంతరం దీనిపై చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.

2014 పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని లేవనెత్తింది. తాము అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికలను నిర్వహిస్తామని మెనిఫెస్టోలో ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బీజేపీ వన్ నేషన్ వన్‌ ఎలక్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని చెబుతూనే ఉంది. చివరికి మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పలు రాజ్యాంగ సవరణలు చేసి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని ఈ కమిటీ సూచించింది. 

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడాన్నే జమిలి ఎన్నికలు అంటారు. భారత్‌కు 1947లో స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగాయి. ఆ సమయంలో దేశమంతటా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో కూడా జమిలి ఎన్నికలే జరిగాయి. 

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278