హెచ్‌ఎంపీవీ వైరస్ బాధితులకు వైద్య సేవలు, చికిత్స అందించేందుకు సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో ప్రత్యేకంగా 40 పడకలతో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్‌ఎన్. రాజకుమారి తెలిపారు. వివిధ శాఖల హెచ్‌ఓడీలు డాక్టర్లు కృష్ణమూర్తి, సునీల్‌కుమార్, వాసుదేవ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌కుమార్, ఆర్‌ఎంఓ డాక్టర్ శేషాద్రిలతో ఆమె మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
0