ఇండియా–సౌత్ ఆఫ్రికా నాలుగు టీ 20 మ్యాచ్‌ల సీరీస్‌లో భాగంగా జరిగిన ఈరోజు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులో భారత జట్టు 11 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి మొదట బ్యాఇంగ్ చేయడానికి భారత్ ను ఆహ్వానించింది సౌత్ ఆఫ్రికా. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 107 పరుగులు, అభిషేక్ శర్మ 25 బంతుల్లో 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేశారు. దీంతో టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మార్కో యాన్సెన్ 16 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 54 పరగులు, హెన్రిచ్ క్లాసెన్ 22 బంతుల్లో 4 సిక్స్‌లు, ఒక ఫోర్ తో 41 పరుగులు చేశారు. అయితే ఈ జట్టుకు చివరి ఓవర్లో 25 పరుగులు అవసరం కాగా 13 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లలో పరుగులు పోకుండా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలంగ్ చేశారు . ఈ విజయంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌లో ముందంజ వేసింది. చివరి టీ20 శుక్రవారం జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనుంది.
అయితే రెండవ ఇన్నింగ్స్‌లో సత్ ఆఫ్రికా బ్యాటర్లు ఇరగదీశారనే చెప్పాలి. వరుణ్ చక్రవర్తి వేసిన 14 ఓవర్లో క్లాసెన్ హ్యాట్రిక్ సిక్స్‌లతోపాటు ఓ ఫోర్ బాదాడు. తర్వాత వచ్చిన యాన్సెన్ కూడా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. రవి బిష్ణోయ్ వేసిన 17 ఓవర్లో చివరి రెండు బంతులను యాన్సెన్ సిక్స్ లుగా మలిచాడు. హార్దిక్ వేసిన 19వ ఓవర్లో యాన్సెన్ విశ్వరూపం ప్రదర్శించి 26 పరుగులు రాబట్టాడు. వరుసగా 4, 6, 4, 2, 6, 4 బాదాడు. కానీ చివరకు అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవరర్లో క్లాసెన్.. తిలక్ వర్మకు చిక్కాడు.