మాకు అందితే ఒక లెక్క…. అందకుంటే మరొలెక్క అన్నట్లు ఉందిగా గుండ్లపొచంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అధికారుల తీరు.. ముచ్చటేంటంటే గుండ్లపొచంపల్లి మున్సిపాలిటీ పరిధి లో ఉన్న అయోధ్య చౌరస్తా దగ్గర వాస్కో కంపెనీ ఆర్అండ్ బీ రూల్స్ ప్రకారం రోడ్డు నుండి సెట్ బ్యాక్ వదిలిపెట్టి ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి కానీ వాళ్లు అట్ల సెట్ బ్యాక్ ఇడవకుండ గోడ కట్టుడు స్టార్ట్ చేసిండ్రు.. ఇది తెలిసిన మున్సిపల్ ,కౌన్సిలర్లు రూల్స్ ప్రకారం కట్టలే…
సెట్ బ్యాక్ వదలని అని హుకుం జారీ చేసి అధికారులు చెప్పి కూలగొట్టించిర్రు.. అరె కౌన్సిలర్లు మంచి బుద్ధిమంతులు ఉన్నరుగా అనిపిస్తుందిగా కానీ అసలు బతలాబు ఏంది అంటే ఇష్టం ఉన్నట్లు గోడ కడుతున్న కంపెనీ వాడు మమ్మల్ని కలిసేది లేదా అని కూలగొట్టించి తీరా కంపెనీ వాడు వాళ్ల కాళ్ళ బేరానికి వచ్చేటట్టు జేసిండ్రు.. చివరకు సదరు కంపెనీ ఓనర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు, అధికారులకు కలిసి నాయనో బయానో ఇచ్చి వారి జేబులు నింపడంతో కూలగొట్టించి వాళ్లే తిరిగి దగ్గరుండి ప్రహరీ గోడ కట్టిచ్చి ఇది అక్రమం ఎట్లా ఐతది సక్రమమే అని అంటుర్రు.
ఇగ గోడ పంచాయతీ ల brs కౌన్సిలర్ బిజెపి కౌన్సిలర్ కొట్లాడుకున్నర్రు అంటనోళ్ల.. పైసలు ఇస్తే సక్రమ ఇవ్వకపోతే అక్రమ కట్టడం ఎట్లా ఇతదో చెప్పలంటున్నారు మున్సిపల్ ప్రజలు…