హైదరాబాద్ నుంచి ఒడిశాకు యాత్రికులతో బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టు తెలిసింది. వీరంతా హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాకకు చెందిన వారని సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? క్షతగాత్రులు ఎక్కడ చికిత్స పొందుతున్నారు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
0