కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 గాజులరామారం డివిజన్ కైలాష్ హిల్స్ నందు 29.60 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి లోని అన్ని డివిజన్లతో పాటు, నిజాంపేట్ కార్పొరేషన్, కొంపల్లి – దుండిగల్ మున్సిపాలిటీలలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఎంతో అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులైన వెచ్చిస్తానని తెలియజేశారు. అనంతరం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0