manatelanganatv.com

రుణమాఫీ చరిత్ర కాంగ్రెస్‌దే..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం 2005-06లో దేశం మొత్తం ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేసిందని, ఇప్పుడు చరిత్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేననిరవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, రైతులు బీఆర్‌ఎస్‌, బీజేపీ చట్రంలో పడొద్దని సూచించారు. ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని, రుణమాఫీ కానీ రైతాంగం ఆందోళన చెందొద్దని మండల కార్యాలయాల్లో వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్‌ ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అమలు అయ్యేలా చూస్తారని స్పష్టంచేశారు. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తామని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే 64 లక్షల మంది ప్రయాణం చేశారని తెలిపారు. టికెట్‌ ద్వారా రూ.15 కోట్ల ఆదాయం వచ్చిందని, నిరంతరం శ్రమించిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఆర్టీసీ నష్టాల నుంచి క్రమంగా గట్టెక్కుతున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ. 1 లక్ష రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టిందని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకే దశలో రైతు రుణమాఫీ పూర్తి చేసిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనేది రైతులకు చెప్పాలన్నారు. పాపన్న విగ్రహం పెట్టాలని అంటున్న కేటీఆర్‌.. పదేండ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు పెట్టలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. తప్పకుండా పాపన్న విగ్రహం పెడతామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ట్యూనింగ్‌.. కిషన్‌ రెడ్డి మ్యూజిక్‌తో.. ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ని విమర్శిస్తే మీకు మీరే అవమానపర్చుకున్నట్లేనని అన్నారు. ఇద్దరూ కలిసి వచ్చినా పార్లమెంట్‌ ఎన్నికల్లో 8 సీట్లు దాటలేదని అన్నారు.
బరాబర్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహం పెడతాం
సెక్రటేరియట్‌ ముందు బరా బర్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహం పెట్ట్టి తీరుతామని మంత్రి పొన్నం తెలిపారు. రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని టచ్‌ చేసే ధైర్యం ఉందా అని సవాలు విసిరారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి రాజీవ్‌ గాంధీ అని, ఆయన విగ్రహంపై మాట్లాడుతున్న కేటీఆర్‌.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడా లన్నారు. సాంకేతిక టెక్నాలజీ విప్లవాన్ని తెచ్చిన వ్యక్తి రాజీవ్‌ గాంధీ అని ప్రశంసిం చారు. హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రిగా సెక్రటేరియట్‌ ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహ పనులు పరిశీలించానన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి , సింగిల్‌ విండో చైర్మెన్‌ బులిసిటీ శివయ్య, కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకులు, సామాజిక కార్యకర్త కర్ణకంటి మంజులరెడ్డి పాల్గొన్నారు

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278