ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి తరపున ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రచారం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోకు వెంకటేష్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుకు నడిచి ప్రజలకు అభివాదం చేశారు. రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రామసహాయం ఓటర్లను కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంకటేష్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి వెంకటేష్ వియ్యంకుడు.
అంతకుముందు ఖమ్మం బైపాస్‌లోని మంత్రి పోగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెంకటేష్ చేరుకున్నారు. తమ అభిమాన నటుడు… మంత్రి ఇంటికి వచ్చారని తెలియడంతో అభిమానులు గుమిగూడారు. వెంకటేష్ భవనం పైనుంచి ఊపుతూ అభిమానులను అలరించారు.