బీఆర్ఎస్ పార్టీ నుండి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన అనంతరం గులాబీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహ పడుతున్నారని చెప్పుకోవచ్చు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకూడా కొందరు కౌన్సిలర్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇకపోతే వైస్ చైర్మన్ మాజీ శాసన సభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ ఖండువ వేసుకున్నారు. 2 మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మాణం పెట్టె ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది..!
0