గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో గతంలో ఉన్న కమిషనర్ రాములు పదవి విరమణ పొందిన సంధర్బంగా మంగళవారం ఇంచార్జి కమిషనర్ గా కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరిని నియమించిన సందర్బంగా నూతన కమిషనర్ ను కార్యాలయంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చెర్ పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు బేరి బాలరాజ్, అమరం హేమంత్ రెడ్డి, అమరం జైపాల్ రెడ్డి, చింత పెంటయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్ గౌడ్, జనార్దన్ రెడ్డి, ఆర్ఓ శ్రీనివాస్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
0