0
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతుండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. అయితే, నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని నాని ఓ వీడియో విడుదల చేశారు.