మేడ్చల్ జిల్లా : మేడ్చల్ లో ఢిల్లీ వరల్డ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వి .మధుసూధన్ రెడ్డి DDG ఆఫ్ తెలంగాణ & ఏపీ , డాక్టర్ నల్లపాటి వెంకటేశ్వరరావు ఢిల్లీ వరల్డ్ స్కూల్స్ చైర్మన్, ప్రెసిడెంట్ నల్లపాటి రాజేశ్వరి ఢిల్లీ వరల్డ్ స్కూల్స్,ప్రిన్సిపాల్ మొల్లేటి ప్రశాంతి ఢిల్లీ వరల్డ్ స్కూల్ మేడ్చల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యతో పాటు, నైతిక విలువలు, వినయ విధేయతలు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యార్థుల మనస్తత్వాలను జాగృతి పరిచే దిశగా సెలబ్రేషన్స్ నిర్వహించామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ క్రమంలో చదువు, ఆటలు, సాంస్కృతిక కళలో విద్యార్థులు సాధించిన విజయాలపై వార్షిక నివేదికను ప్రవేశపెట్టి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.