రోజురోజుకు అక్రమ మట్టి తవ్వకాలు పెరిగిపోతున్నాయి. మట్టి మాఫియాతో లక్షల సంపాదనతో జేబులు నింపుకుంటున్నారు. గతకొంత కాలంగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గిర్మాపూర్ దాతర్ చెరువులో వెంకట్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి సమయంలో అధికారుల కళ్ళు కప్పి హిటాచి పెట్టించి టిప్పర్ లలో అక్రమంగా నల్లమట్టిని ఇటుక బట్టీలలో రవాణా చేస్తున్నాడు. ట్రిప్పుకు 15 నుండి 20 వేలవరకు సంపాదనతో జేబులు నింపుకుంటున్నాడు. రాత్రి 12 గం.ల తరువాత హిటాచి పెట్టించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల కళ్ళు కప్పి అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. 12 గంటలనుండి ఉదయం 5 గంటలవరకు టిప్పర్లతో నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్నాడని గిర్మాపూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు
0