హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ఫేజ్ – 1 లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై జిహెచ్ఎంసి అధికారులు, కాలనీ వాసులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి, పాదయాత్ర చేసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్బంగా మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో సంతులిత, సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని కాలనీ లలో స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుండి సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని, ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ను కూడా పరిగణలోకి తీసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావ పేర్కొన్నారు.
కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్, శానిటేషన్, ట్రాఫిక్ సంభందిత సమస్యలను శాశ్వత పరిష్కారం చూపుతామని త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ రమేష్, ఏఈ రాజీవ్, మేనేజర్ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఎస్ఆర్పి సత్యనారాయణ, హార్టికల్చర్ దాసు, డ్రైనేజి సూపర్వైజర్ ఓం ప్రకాష్, ఎలక్ట్రికల్ లైన్ మెన్ వెంకటేష్, ఎస్ఎఫ్ఏ రమణ, ఎంటమాలజి మురళి కాలనీ వాసులు శ్రీనివాస దాసు, సైదేశ్వర్ రావు, రామలింగేశ్వర రావు, విలియమ్స్, ఆంజనేయులు, ప్రసాద రావు, శ్రీనివాస్, చంద్ర మౌళి, ప్రసాద్, మహిళలు కృష్ణ కుమారి, జ్యోతి, ఉమా రాణి మరియు నాయకులు కుమార స్వామి, నిరంజన్ గౌడ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.