ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కొందమంది దుర్మార్గులు అత్యాచారాలు చేసిన తర్వాత హత్యలకు పాల్పపడుతున్నారు. గత పదేళ్ళలుగా దేశంలో ఇలాంటి నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలను టార్గెట్ చేసుకొని కామాంధులు రెచ్చిపోతున్నారు. సామాన్య మహిళలకే కాదు.. ఈ తిప్పలు సెలబ్రెటీలు, రాజకీయాల్లో ఉన్న మహిళలకు కూడా తప్పడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని జీహెచ్ఎంసీ మేయర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వీడియోలు, పోస్టులు పెడుతున్నారని హైదరాబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనని టార్గెట్ చేసుకొని కావాలనే కొంతమంది ఇలాంటి పోస్టులు పెడుతూ మానసికంగా వేదిస్తున్నారని.. ఇలాంటి వీడియోల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు, తనను ట్రోల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఎక్కడెక్కడ వీడియోలు పోస్ట్ చేశారో అన్న వివరాలతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు.