ముడుచినతలపల్లి మండలం ఉద్దమరి గ్రామ రెవెన్యూ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్ అంటూ సామాన్యుడి వసరాన్ని ఆసరాగా తీసుకొని మోసాలకు తెగబడుతున్నారు. శిల్పా ఇంప్గ్రాటెక్ సంస్థ మాజీ మంత్రి అంటూ ప్లాట్లను అమ్మకాలు చేస్తున్నారు. దీనిపై హెచ్ఎమ్ డిఏ అధికారులను అడుగగా లోకల్ బాడికి సంబంధం అంటారు. లోకల్ బాడిని అడుగగా హెచ్.ఎమ్.డి.ఏకు సంభంధమని అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంవల్ల
ఈ కొద్దికాలంలోనే కోట్ల కుంభకోణం మేడ్చల్ జిల్లాలో జరిగింది దీనిపై హెచ్ఎం డీఏ కానీ లోకల్ బాడి కానీ స్పందించకపోవడం వల్ల భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్రవదిలి వీటిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.