మేడ్చల్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈటల రాజేందర్. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంటు బి.జె.పి అభ్యర్థి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులతో కలిసి, ZPHS, పూడూరు గ్రామం, మేడ్చల్ మండలంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు అందరూ ఓటు హక్కు వినియోగిచుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు, ప్రచారాలకు లొంగకుండా ఓటు వేయండని కోరారు. పోలింగ్ శాతం పెంచేందుకు అందరూ కృషి చేయాలనని వెల్లడించారు.
కాగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. బిజెపి ఎంపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అటు గులాబీ పార్టీ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పట్నం మహేందర్రెడ్డి సతీమణి పోటీ చేస్తున్నారు.