సార్.. మాకు ఆరు నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ప్రతి నెలా జీతాలు ఇచ్చేలా చూడండి’ అంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ మంత్రి శ్రీధర్‌బాబు కాళ్లపై పడి వేడుకున్నాడు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల గుడిపేట పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు రాగా గేట్ ఆపరేటర్ లక్ష్మణ్ ఆయనతో మొరపెట్టుకున్నాడు. ఎల్లంపల్లిలో మొత్తం తొమ్మిది మంది కాంట్రాక్టు గేట్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా బిల్లులు వస్త లేవని వేతనాలను చెల్లించడం లేదని మంత్రి ఎదుట వాపోయాడు. ఒక వేళ వేతనాలు ఇచ్చినా ఏడుగురికి సరిపడా వేతనాలు ఇచ్చి 9 మంది తీసుకోవాలని అధికారులంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రి శ్రీధర్ బాబు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని అక్కడున్న ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.
0